Wednesday 7 June 2017

గురువు ప్రేమ / GURUVU PREMA

జెన్ గురువు సుజుకి రోషికి గొప్ప పేరుంది.ఆయన తన శిష్యులను చాలా ప్రేమగా చూసుకునే వారు.శిష్యులకు కూడా గురువంటే అమిత గౌరవాభిమానాలు ఉండేవి.శిష్యుల్లో ఒక అమ్మాయికి గురువు గారిపై ప్రేమ కలిగింది.ఆయన లేనిదే బ్రతుకు లేదనే భావనలో పడిపోయింది.ఒక రోజు ఆమె గురువు దగ్గరికి వచ్చింది.ఎలాగైనా తన ప్రేమను ఆయనకు చెప్పాలనుకుంది.ప్రేమతో కూడిన హావభావాలు వ్యక్తం చేస్తూ,ఏదొరకంగా గురువు గారి మనసులో చోటు సంపాదించాలని భావించింది.ఐతే అది ప్రేమో కాదో తెలియని అయోమయ స్థితిలో ఉందామె.తీరా గురువు గారు ఏమంటారో అనే ఆలోచన ఆమెను కుదురుగా ఉండనివ్వడంలేదు.శిష్యురాలి ఇబ్బందిని గ్రహించిన సుజుకి ఆమె తలను ఆప్యాయంగా నిమిరి ' నీవు ఏమీ బాధ పడకు , మీ గురువు మీద ఉన్న ప్రేమనంతా, అభిమానాన్నంతా అలాగే మనసులో ఉంచుకోండి.అది మంచిదే.ఐతే మన ఇద్దరికీ సంబంధించి , అంటే గురు శిష్యులకు సంబంధించినంతవరకు కావలసినంత క్రమశిక్షణ నేను కలిగి ఉన్నాను.నా శిష్యురాలిగా నీలోనూ ఆ గుణం ఉందని విశ్వసిస్తున్నాను, అని సున్నితంగా ఆమె ప్రేమను తిరస్కరించాడు.ఆ మాటలు వినగానే ఆమెకు గురువు గొప్పదనం తెలిసివచ్చింది.ఆయన గురువుగా లభించడం తన అదృష్తంగా భావించింది.

No comments:

Post a Comment